![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -96 లో....ధన సీతాకాంత్ ఆఫీస్ లోనే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. బోర్డు డైరెక్టర్స్ మీకున్నా టాలెంట్ కి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ వద్దు.. జూనియర్ అసిస్టెంట్ గా అప్పాయింట్ చేస్తున్నామని ధనతో అనగానే.. నేను సీతాకాంత్ కి బావమరిదిని అవుతాను.. నన్ను ఇలా అవమానిస్తారా.. మీ సంగతి వెళ్లి తనకి చెప్తానని ధన వాళ్లపై కోప్పడతాడు. సీతాకాంత్ సర్ ట్యాలెంట్ ని చూసే జాబ్ ఇస్తాడని వాళ్ళు అంటారు.. మీ సంగతి చెప్తే మిమ్మల్ని ఆఫీస్ నుండి తీసేస్తారని ధన కోపంగా వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అభి తన ఫ్రెండ్ కి... సీతాకాంత్ తో ఒక లైఫ్ సెటిల్ అయ్యో డీలింగ్ చెప్పాను.. అది కనుక ఒప్పుకుంటే ఇక రామలక్ష్మి జోలికి రానని చెప్పాను.. కానీ రామలక్ష్మిని వదిలి పెట్టను. సీతాకాంత్ పై కోపం ఉంది గనుక రామలక్ష్మిపై మోజు తీర్చుకొని వదిలేస్తాను. అపుడు సీతాకాంత్ పై పగ తీరుతుందని అభి తన ఫ్రెండ్ కి చెప్తాడు. మరొక వైపు అభి మాటలు నమ్మడానికి లేదు కచ్చితంగా రామలక్ష్మి జోలికి వస్తాడు.. అందుకే మోసానికి మోసం చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి పేపర్ లో వచ్చిన ఐఏఎస్ ఎగ్జామ్స్ కి సంబంధించిన న్యూస్ చూసి.. అన్ని బాగుంటే ఇప్పటికి ప్రిపరేషన్ లో ఉండేదేన్ని అని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావని అడుగుతాడు. చుట్టూ ఇన్ని సమస్యలున్నాయని రామలక్ష్మి చెప్పగానే.. చిన్నప్పుడు తాను పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చి రామలక్ష్మి ని మోటివేట్ చేస్తాడు.
ఆ తర్వాత ధన కోపంగా ఇంటికి వస్తాడు. జరిగింది తెలుసుకొని సిరి కోపంగా సీతాకాంత్ దగ్గరికి వచ్చి ఇంత అవమానిస్తారా అంటూ అడుగుతుంది. అప్పుడే శ్రీలత వచ్చి అన్నయ్యని క్వశ్చన్ వేస్తున్నావా అని సీరియస్ అవుతుంది. దాంతో సిరి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సిరి, ధన దగ్గరికి రామలక్ష్మి వెళ్లి.. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఇద్దరికి అర్ధం అయ్యేలా చెప్తుంది. అదంతా సీతాకాంత్ విని రామలక్ష్మి ని చూస్తూ.. అర్థం చేసుకునే భార్య పక్కన ఉంది కానో జీవితంలో లేదని అనుకుంటాడు. రామలక్ష్మిని సీతాకాంత్ నుండి దూరం చేసినట్టు సీతాకాంత్ కల కంటాడు. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ మేనేజర్ వచ్చి.. మీరు చెప్పినట్టు ఊటి రెసాట్ చూసానని అనగానే. సరే కానీ ఫేక్ కాపీ రెడీ చెయ్ అని సీతాకాంత్ అంటాడు. ఇదంతా వాడికి తెలిస్తే ఊరుకోడూ కదా సర్ అని అతను అడుగుతాడు. వాడు బయటకు వస్తే కదా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |